The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
All other trademarks are the property of their respective owners.
Red Hat Enterprise Linux చిన్న విడుదలలు అనునవి స్వతంత్ర వృద్ధి, రక్షణ మరియు బగ్ పరిష్కార యెర్రాటా యొక్క సంకలనం. Red Hat Enterprise Linux 5.5 విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux 5 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మరియు దానితోటి అనువర్తనములకు ఈ చిన్న విడుదలనందు చేసిన పెద్ద మార్పులను పత్రికీకరణ చేయును. ఈ చిన్న విడుదల నందలి అన్ని మార్పులపై విశదీకృత సమాచారము సాంకేతిక గమనికల నందు అందుబాటులో వుంది.
Red Hat Enterprise Linux 5.5 విడుదల నందలి ముఖ్యమైన అంశములు Intel Boxboro-EX platform, AMD Magny-Cours processor మరియు IBM Power 7 processor కొరకు హార్డువేర్ చైతన్యవంతం. బహుళ 10 GigE SR-IOV కార్డ్స్ మద్దతు, మరియు సిస్టమ్‌పై వర్చ్యువల్ గెస్టు మెమొరీను చేతనపరచి నప్పుడు దానికొరకు స్వయంచాలకంగా hugepages వినియోగం వంటి వాటి మద్దతుతో, వర్చ్యులైజేషన్ మెరుగుపరచబడింది. Microsoft Office 2007 ఫిల్టర్సు కొరకు OpenOffice నవీకరణ, Windows 7 సారూప్యత కొరకు Samba నవీకరణ మరియు Microsoft ఆధారిత PXE సేవలను వుపయోగిస్తూ వర్చ్యువల్ మిషన్ల కొరకు బూట్ మద్దతు వంటివి, యింటరాపరబిలిటి నందలి మెరుగుదలలు.
1. సంస్థాపన
సిస్టమ్ సంస్థాపకి (anaconda)కు చాలా బగ్పరిష్కారములను మరియు విస్తరింపులను Red Hat Enterprise Linux 5.5 పరిచయం చేస్తోంది.
NFS మూలము నుండి సంస్థాపించునప్పుడు అదనపు నెట్వర్కు ఫైల్ సిస్టమ్ (NFS) మౌంట్ ఐచ్చికాలను తెలుపుటకు సామర్ధ్యమును జతచేయుటద్వారా యింటరాక్టివ్ సంస్థాపకి విస్తరించబడింది. (BZ#493052). అదనంగా, సంకేతపదముతో రక్షించబడుచున్న ఫైల్ ట్రాన్సుపోర్టు ప్రొటోకాల్ (FTP) సేవికలపై వున్న సంస్థాపనా మూలములు (ఉ.దా. కిక్‌స్టార్ట్ ఫైళ్ళు) యిప్పుడు సంస్థాపననందు పొందగలము (BZ#505424).
కిక్‌స్టార్ట్
Red Hat Enterprise Linux సంస్థాపనను స్వయంచాలనం చేయుటకు వినియోగదారులకు కిక్‌స్టార్ట్ వొక మార్గమును అందించును. కిక్‌స్టార్టు వుపయోగించి, సిస్టమ్ నిర్వాహకుడు సంస్థాపనా సమయమందు వచ్చు అన్ని ప్రశ్నలకు సమాధానలను కలిగిన వొక ఫైలును సృష్టించగలడు.
కిక్‌స్టార్ట్ డీబగ్గింగ్ మరియు దోష నివేదీకరణ మెరుగుపరచబడింది. డీబగ్గింగ్ నందు సంస్థాపకి యిప్పుడు కిక్‌స్టార్ట్ స్క్రిప్టులెట్సును నిలిపివుంచును, logs standard output (stdout) మరియు standard error (stderr) streams, మరియు లాగ్స్ దోష సందేశాలను anaconda.logకు (BZ#510636).
స్వతంత్ర ప్యాకేజీలు తీసివేయబడినట్లు గానే ప్యాకేజీ గ్రూపులు కూడా యిప్పుడు కిక్‌స్టార్ట్ సంస్థాపననందు తొలగించగలము (BZ#558516). అదనంగా, bootloader ఆదేశము యిప్పుడు --hvargs పారామితిని మద్దతించుచున్నది, Xen హైపర్విజర్ ఆర్గుమెంట్లను అనుమతించుట కిక్‌స్టార్ట్ సంస్థాపననందు తెలుపవలెను (BZ#501438).
గతంలో, కిక్‌స్టార్ట్ సంస్థాపనా విధానము అన్ని ప్యాకేజీలను యెంపికచేయుటకు రెండు ఐచ్చికాలను యిచ్చును @Everything మరియు * (wildcard). Red Hat Enterprise Linux 5.5 సంభందించినంత వరకు, ఈ రెండు ఐచ్చికములు తీసివేయడమైంది. విభేదించుచున్న ప్యాకేజీల కొరకు కిక్‌స్టార్టు ఫైలు ప్యాకేజీ నెగేషన్ను చేర్చితే తప్పించి, అన్ని ప్యాకేజీలను యెంపికచేయి అను ఐచ్చికం వుపయోగించుటకు చేయు ప్రయత్నం విఫలమగును. అందువలన, విభేదించుచున్న ప్యాకేజీలు కాక అన్ని ప్యాకేజీలను సంస్థాపించుటకు, కిక్‌స్టార్ట్ ఫైలు తప్పక యిది కలిగివుండవలెను:
%packages @Everything -@Conflicts
Red Hat Enterprise Linux 5.5 కొత్త ప్యాకేజీ సెట్లు samba3x, freeradius2, postgres84 కలిగివుంటుంది. ఈ ప్యాకేజీ సెట్లు kickstart ద్వారా మాత్రమే సిస్టమ్ సంస్థాపనా సమయమందు అందుబాటులోవుంటాయి లేదా సంస్థాపిత సిస్టమ్సు కొరకు yum ద్వారా అందుబాటులో వుంటాయి.
హార్డువేర్ మద్దతు
సంస్థాపనా సమయమందు క్రింది పరికర డ్రైవర్లు మద్దతించబడుచున్నవి:
PMC Sierra MaxRAID నియంత్రిక ఎడాప్టర్ల కొరకు pmcraid డ్రైవర్ (BZ#532777)
Power6 Virtual FC పరికరముల కొరకు pmcraid డ్రైవర్ (BZ#512237).
Brocade Fibre Channel to PCIe Host Bus Adapters కొరకు bfa డ్రైవర్ (BZ#475707)
ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరముల కొరకు be2iscsi డ్రైవర్ (BZ#529442).
Note
సంస్థాపనపై విశదీకృత సమాచారము కొరకు, సంస్థాపనా మార్గదర్శి Red Hat Enterprise Linux 5ను యెలా సంస్థాపించాలో పత్రికీకరణ చేయును.
2. వర్చ్యులైజేషన్
Red Hat Enterprise Linux 5.5 చాలా నవీకరణలను వర్చ్యులైజేషన్‌కు అందించును. వర్చ్యులైజేషన్ మూలకాలకు జరిగిన అన్ని మార్పులపై విశదీకృత సమాచారము సాంకేతిక గమనికలు నందు అందుబాటులోవుంది.
Note
క్లస్టర్ సూట్ వుపయోగించి KVM ఆధారిత వర్చ్యువల్ గెస్టుల నిర్వహణ యిప్పుడు పూర్తిగా మద్దతించబడును.
SPICE
Simple Protocol for Independent Computing Environments (SPICE) రిమోట్ డిస్ప్లే ప్రొటోకాల్ కొరకు ఫంక్షనాలిటీను అందించు మూలకాలను Red Hat Enterprise Linux 5.5 కలిగివుంది. ఈ మూలకములు, Red Hat Enterprise Virtualization వుత్పత్తులతో కలిపి వుపయోగించుటకు మరియు స్థిరమైన ABI కలిగివుండునని హామీలేదు. Red Hat Enterprise Virtualization వుత్పత్తుల యొక్క ఫంక్షనల్ అవసరములతో ఏకీకృతం కావడానికి ఈ మూలకములు నవీకరించబడును. భవిష్య విడుదలలకు మైగ్రేట్ అగుటకు వొక్కో-సిస్టమ్ చొప్పున మాన్యువల్ ఆపరేషన్ అవసరపడవచ్చును.
PCI పాస్‌త్రూ మెరుగుదలలు
PCI పాస్‌త్రూ PCI పరికరములు అవి గెస్టు ఆపరేటింగ్ సిస్టమ్‌కు భౌతికంగా అనుభందించబడి వున్నట్లు కనిపించుటకు మరియు ప్రవర్తించుటకు అనుమతించును. KVM మరియు Xen హైపర్విజర్స్ రెండూ కూడా PCI పరికరములను హోస్టు సిస్టమ్‌పై వర్చ్యులైజ్డు గెస్టులకు అనుభందించుటకు మద్దతించును.
PCI పాస్‌త్రూ నందు సహాయపడే, AMD యిన్పుట్/అవుట్‌పుట్ మెమొరీ మేనేజ్మెంట్ యూనిట్ (IOMMU) కెర్నల్ డ్రైవర్, నవీకరించబడెను. సిస్టమ్ నిర్వహణా అభ్యర్ధనలు సరిగా సంభాలించలేక పోవుచున్న సమస్యను ఈ నవీకరణ పరిష్కరించినది. (BZ#531469)
KVM హైపర్విజర్సుపై Intel VT-d పొడిగింపులను వుపయోగించి PCI పాస్‌త్రూ కొరకు మద్దతు మెరుగుపరచబడింది. పరికమును వేరొక గెస్టునకు తిరిగిఅప్పగించుట అనునది అనుమతించు ద్వారా, పరికరములు (భౌతిక లేదా వర్చ్యువల్) యిప్పుడు మూసివేయవచ్చును మరియు రన్టైము నందు గెస్టునుండి అననుసంధానించవచ్చును. ఈ తిరిగిఅప్పగింత లైవ్‌గా కూడా జరుపవచ్చును (BZ#516811). అదనంగా, 1:1 మాపింగ్ పనితనం మెరుగుపరచబడింది (BZ#518103).
Note
వర్చ్యులైజేషన్పై విశదీకృత సమాచారము కొరకు, వర్చ్యులైజేషన్ మార్గదర్శి అనునది ఖచ్చితమైన మార్గదర్శిని Red Hat Enterprise Linuxపై వర్చ్యులైజేషన్ కొరకు.
HugePages మద్దతు
hugetlbfs (HugePages) చేతనము చేయుటకు కొత్త నియమాలు libvirt నందు అందుబాటులో వున్నాయి. ఒక సిస్టమ్ Hugepagesతో ఆకృతీకరించబడినప్పుడు, libvirt స్వయంచాలకంగా మెమొరీను hugetlbfs నుండి వర్చ్యువల్ గెస్టు మెమొరీకు కేటాయించును. హార్డువేరునందు యెక్స్టెండెడ్ పేజ్ పట్టికలను మరియు నెస్టెడ్ పేజ్ పట్టికలను మిళితం చేసినప్పుడు, గెస్టు ద్వారా గుర్తించదగిన పనితనపు మెరుగుదలలు సాదించబడును. (BZ#518099)
3. కెర్నల్
3.1. కెర్నల్ ప్లాట్‌ఫాం ఎనేబుల్మెంట్
ఈ విడుదల Intel యొక్క కొత్త ప్లాట్‌ఫాంలు, code-named Boxboro-EX మరియు Boxboro-MCకు, AMD యొక్క కొత్త ప్రొసెసర్ ఫామిలి, code-named Magny-Cours మరియు IBM's Power7 ప్రొసెసర్కు మద్దతునిస్తోంది.
3.2. కెర్నల్ సాధారణ విశేషణాలు
కెర్నల్ కర్తవ్యాలను గుర్తించుట అనునది ఆటంకపరచలేని స్లీప్ స్థితినందు యిరుక్కున్నది
కొన్ని పరిస్థితులలో, కెర్నల్ నందలి కర్తవ్యములు శాశ్వతంగా ఆటంకపరచలేని స్లీప్ స్థితి (D-State)కు వెళ్ళవచ్చును, సిస్టమ్‌ను మూసివేయుట ఆసాధ్యం కావచ్చును. ఈ నవీకరణతో, Detect Hung Task కెర్నల్ త్రెడ్ జతచేయబడినది, శాశ్వతంగా D-State నందు యిరుక్కున్న కర్తవ్యాలను గుర్తించు సామర్ధ్యమును అందించును.
ఈ కొత్త విశేషణము CONFIG_DETECT_HUNG_TASK కెర్నల్ ఫ్లాగ్ ద్వారా నియంత్రించబడును. "y"కు అమర్చబడినప్పుడు D-State నందు యిరుక్కున్న కర్తవ్యములు గుర్తించబడును; nకు అమర్చబడినప్పుడు అది ఆఫ్ చేయబడును. CONFIG_DETECT_HUNG_TASK ఫ్లాగ్ యొక్క అప్రమేయ విలువ y.
అదనంగా, CONFIG_BOOTPARAM_HUNG_TASK_PANIC ఫ్లాగ్ జతచేయబడింది. yకు అమర్చబడినప్పుడు, D-State నందు యిరుక్కున్న కర్తవ్యం గుర్తించబడగానే కెర్నల్ పానిక్ ట్రిగ్గర్ చేయబడును. CONFIG_BOOTPARAM_HUNG_TASK_PANIC ఫ్లాగ్ కొరకు అప్రమేయ విలువ n.
కెర్నల్ నందలి వైర్లెస్ డ్రైవర్లకు మరియు సబ్సిస్టమ్సుకు Red Hat Enterprise Linux 5.5 మేజర్ నవీకరణలను కలిగివుంది.
Intel wireless network adapters కొరకు iwlwifi డ్రైవర్లు నవీకరించబడెను. ఈ హార్డువేర్ లైన్ నందలి పరికరములు 802.11a, 802.11b, 802.11g, మరియు 802.11n వైర్లెస్ ప్రొటోకాల్సును మద్దతించును. ఈ నవీకరణ కొత్త మద్దుతును iwl6000 మరియు iwl1000 పరికరముల కొరకు అందించును, మరియు విస్తరిత మద్దతును iwl5000, iwl4965 మరియు iwl3945 పరికరముల కొరకు అందించును.
వైర్లెస్ పరికరముల కొరకు rt2x00 డ్రైవర్లు నవీకరించబడెను. ఈ నవీకరణ Ralink rt2400pci, rt2500pci, rt2500usb, rt61pci మరియు rt73usb చిప్సెట్ల కొరకు డ్రైవర్లను తాజాపరచును, rtl8180 మరియు rtl8187 Realtek చిప్సెట్ల కొరకు డ్రైవర్లను తాజాపరచును.
Atheros 802.11n wireless LAN యెడాప్టర్స్ కొరకు ath9k డ్రైవర్ నవీకరించబడెను.
ఈ డ్రైవర్ల యొక్క విశేషణాలను మద్దతించుటకు, mac80211 మరియు cfg80211 కెర్నల్ సబ్సిస్టమ్సు నవీకరించబడెను.
Solarflare డ్రైవర్
Red Hat Enterprise Linux 5.5 నందు, Solarflare డ్రైవర్ (sfc) జతచేయబడెను (BZ#448856)
Neterion's X3100 Series 10GbE PCIe డ్రైవర్
Neterion's X3100 Series 10GbE PCIe పరికరముల కొరకు vxge డ్రైవర్ జతచేయబడెను (BZ#453683).
ServerEngines BladeEngine2 10Gbps డ్రైవర్
ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్కు పరికరముల కొరకు be2net డ్రైవర్ నవీకరించబడెను (BZ#549460)
LSI MegaRAID SAS నియంత్రికల కొరకు megaraid_sas డ్రైవర్ వర్షన్ 4.17-RH1కు నవీకరించబడెను. ఈ నవీకరణ చాలా సమస్యలను పరిష్కరించెను, ముఖ్యంగా:
ఫర్మువేర్ బూట్ మరియు సిద్దీకరణనందలి సమస్య పరిష్కరించబడినది.
హైబర్నేషన్ నందు పరికరములు స్థంబిచిపోవు సమస్య యిప్పుడు పరిష్కరించబడెను.
డ్రైవర్ యిప్పుడు పరికరమును జతచేసినప్పుడు లేదా తీసివేసినప్పుడు స్వయంచాలకంగా నవీకరించును.
MegaRAID SAS డ్రైవర్ యిప్పుడు లెగసి I/O port free
5. ఫైల్సిస్టమ్/నిల్వ నిర్వహణ
మెరుగైన CFQ I/O షెడ్యూలర్ పనితనము
కొన్ని అనువర్తనములు (ఉ.దా. dump మరియు nfsd) I/O అభ్యర్ధనలను బహుళ ప్రోసెసెస్కు లేదా త్రెడ్స్కు పంచుటద్వారా డిస్కు I/O పనితనమును మెరుగు పరచుటకు ప్రయత్నించుచున్నవి. ఏమైనప్పటికి, కంప్లీట్లీ ఫెయిర్ క్యూయింగ్ (CFQ) I/O షెడ్యూలర్ను వుపయోగించునప్పుడు, ఈ అనువర్తనము I/O పనితనంను ఋణాత్మకంగా ప్రభావితంచేసినది. Red Hat Enterprise Linux 5.5 నందు, కెర్నల్ యిప్పుడు సహకరించుకొనుచున్న క్యూలను గుర్తించి మిళితం చేయగలదు. అధనంగా, కెర్నల్ యిది కూడా చేయును వొకవేళ క్యూలు సహకరించుకోకపోతే వాటిని గుర్తించి, మరలా వేరుచేయును.
కొత్త GFS2 మౌంట్ ఐచ్చికము
ఈ నవీకరణ GFS2 మద్దతును errors= మౌంట్ ఆదేశ వరుస ఐచ్చికము కొరకు యిచ్చుచున్నది, ఇది సమస్యపరిష్కారమునందు సహాయపడగలదు. అప్రమేయ ఐచ్చికము, errors=withdraw అనునది I/O దోషము లేదా మెటాడాటా దోషము యెదురైనప్పుడు ఫైల్సిస్టమ్ క్లస్టర్నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయుటకు కారణమగును. ప్రత్యామ్నాయం, errors=panicకూడా యీ పరిస్థితిలో యిబ్బందిగానే ఫలితం యిచ్చును. (BZ#518106)
CIFS నవీకరణ
కామన్ యింటర్నెట్ ఫైల్ సిస్టమ్ (CIFS) అనునది కెర్నల్ నందు నవీకరించబడెను.(BZ#500838)
6. సాధనములు
6.1. GNU ప్రోజెక్టు డీబగ్గర్ (GDB)
C, C++, మరియు యితర భాషలనందు వ్రాసిన ప్రోగ్రాములను నియంత్రిత శైలిలో నిర్వర్తించుట ద్వారాను, మరియు వాటి డాటాను ముద్రించుట ద్వారాను GNU Project debugger (సాధారణంగా GDBగా చూడబడు) ప్రోగ్రాములను డీబగ్ చేయును.
Red Hat Enterprise Linux 5.5 నందు, GDB అనునది వర్షన్ 7.0.1కు నవీకరించబడెను. మార్పుల యొక్క విశదీకృత జాబితా కొరకు సాంకేతిక గమనికల GDB విభాగమును పరిశీలించుము.
వృద్ధిపరచిన C++ మద్దతు
GDB నందు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క మద్దతు మెరుగుపరచబడెను. ముఖ్యంగా గమనించదగిన మెరుగుదలలు:
ఎక్స్టెన్షన్ పార్శింగ్ కొరకు చాలా మెరుగుదలలు.
టైప్ నేమ్స్ వుత్తమంగా సంభాలించ గల్గుట.
ఎక్స్ట్రానియస్ కోటింగ్ యొక్క అవసరము దాదాపుగా తీసివేయబడింది
inferior ఆక్షేపణను తెలిపినప్పటికి "next" మరియు యితర స్టెప్పింగ్ ఆదేశములు సరిగా పనిచేయుచున్నవి.
GDB కొత్త "catch syscall" ఆదేశమును కలిగివుంది. inferior యెప్పుడు సిస్టమ్ కాల్ చేసినా దానిని ఆపుటకు దీనిని వుపయోగించగలము.
వైడ్ మరియు మల్టీ-బైట్ కారెక్టర్ మద్దతు
GDB యిప్పుడు టార్గెట్‌పై వైడ్ మరియు మల్టీ-బైట్ కారెక్టర్స్ కొరకు మద్దతును కలిగివుంది.
ఇండిపెండెంట్ త్రెడ్ డీబగ్గింగ్
త్రెడ్ నిర్వర్తన అనునది యిప్పుడు త్రెడ్స్ యిండివిడ్యువల్గా మరియు యిండిపెండెండ్గా వొకదానిపై వొకటి డీబగ్ చేసుకొనుటను అనుమతించును; కొత్త అమర్పులు "set target-async" మరియు "set non-stop" చేతనం చేయుటద్వారా.
6.2. SystemTap
SystemTap అనునది జాడతెలుసుకొనే మరియు సమగ్రంగా పరిశీలించే వొక సాధనము అది వినియోగదారులు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క క్రియలను నిశితంగా గమనించుటకు మరియు పర్యవేక్షించుటకు అనుమతించును (ప్రత్యేకించి, కెర్నల్‌ను). ఇది netstat, ps, top, మరియు iostat వంటి సాధనముల అవుట్‌పుట్‌కు సమానమైన అవుట్‌పుట్‌నే యిచ్చును; ఏమైనప్పటికి, సేకరించిన సమాచారమును మరింతగా క్రోడీకరించు మరియు విశ్లేషించు ఐచ్చికాలను అందించుటకు SystemTap రూపొందించబడెను.
కొత్త కెర్నల్ ట్రేస్‌పాయింట్స్
ట్రేస్ పాయింట్స్ అనునవి కెర్నల్ యొక్క ముఖ్యమైన విభాగములనందు వుంచబడెను, యిది సిస్టమ్ నిర్వహణాధికారి కోడ్ యొక్క విభాగములను డీబగ్ చేయుటకు, మరియు పనితనమును విశ్లేషించుటకు అనుమతించును. Red Hat Enterprise Linux 5.5 నందు, చాలా విస్త్రుత రీతిలో ట్రేస్పాయింట్సు కెర్నల్‌కు జతచేయబడెను (BZ#475710), నెట్వర్కింగ్ కొరకు ట్రేస్పాయింట్లతో కూడా కలుపుకొని (BZ#475457), coredump (BZ#517115) మరియు signal (BZ#517121).
Note
కెర్నల్ నందు అందుబాటులోవున్న ట్రేస్పాయింట్ల జాబితా దీనితో పొందగలము:
stap -L 'kernel.trace("*")'|sort
అన్ప్రివిలైజ్డ్ మోడ్
గతంలో, root అనుమతులు గల వినియోగదారులు మాత్రమే SystemTap వుపయోగించగలిగేవారు. ఈ నవీకరణ SystemTap యొక్క అన్ప్రివిలైజ్డ్ మోడ్‌ను పరిచయం చేస్తోంది, root-కాని వినియోగదారులు కూడా SystemTapను వినియోగించగలరు. అన్ప్రివిలైజ్డ్ పై విశదీకృత సమాచారము man stap-client మాన్పేజీపై వుంది.
Important
అన్ప్రివిలైజ్డ్ మోడ్ అనునది Red Hat Enterprise Linux 5.5 నందు సాంకేతిక పరిదృశ్యంగా పరిగణించడమైంది. ఇది ఆధారపడే stap-server సౌలభ్యముపై రక్షణ మెరుగుదలల కొరకు పని జరుగుతోంది మరియు నమ్మదగిన నెట్వర్కుపై జాగ్రత్తగా డిప్లోయ్ చేయాలి.
C++ ప్రోబింగ్
C++ ప్రోగ్రామ్ ప్రోబింగ్ మెరుగుదలలు యూజర్-స్పేస్ ప్రోగ్రామ్స్ యొక్క వుత్తమ ప్రోబింగ్‌ను కూడా అనుమతించును.
6.3. Valgrind
మెమొరీ చదువుట, వ్రాయుట, మరియు కేటాయించుట వంటి ఆపరేషన్లను పర్యవేక్షించుటకు Valgrind వుపయోగించబడింది. మెమొరీ నిర్వహణా సమస్యలను విశ్లేషించుటకు మరియు డీబగ్ చేయుటకు valgrind సాధనము అనునది తరచుగా అభివృద్ది కారులచే వుపయోగించబడును.
Valgrind అనునది వర్షన్ 3.5.0కు నవీకరించబడింది, విస్తృత స్థాయిలో సిస్టమ్ ఆకృతుల కొరకు మద్దతును అందించును. ఈ నవీకరణ Valgrind యొక్క పనితనమునకు, స్కేలబిలిటీకి మరియు వినియోగతకు చాలా మెరుగుదలలను యిచ్చుచున్నది. ముఖ్యంగా, Helgrind సాధనము యొక్క యూజబిలిటి మరియు స్కేలబిలిటి — ఏదైతే రేస్ నియమాలను గుర్తించుటకు వుపయోగించబడునో — మెరుగుపరచబడింది. Memcheck సాధనము యొక్క లీక్ చెకింగ్ సమార్ద్యములు కూడా మెరుగుపరచబడినవి. అదనంగా, DWARF డీబగ్గింగ్ సమాచారము కొరకు మద్దతుకూడా విస్తరించబడింది.
7. డెస్కుటాప్ నవీకరణలు
OpenOffice.org
OpenOffice.org అనునది వొక వోపెన్ సోర్స్, మల్టీ-ప్లాట్‌ఫాం ఆఫీస్ వుత్పాదకత సూట్. ఇది కీ టెస్కుటాప్ అనువర్తనములు, వర్డ్ప్రోసెస్, స్ప్రెడ్‌షీట్, మరియు ప్రెజెంటేషన్ మెనేజర్ వంటివి కలిగివుంటుంది. Open Office.org నవీకరించబడింది, చాలా బగ్ పరిష్కారములను మరియు విస్తరింపులను అందిచుచున్నది, Microsoft Office 2007 OOXML ఫార్మాట్స్‌కు కూడా మద్దతిస్తోంది.
మెటాసిటి
మెటాసిటి, GNOME డెస్కుటాప్ కొరకు అప్రమేయ విండో నిర్వాహిక నవీకరించబడినది, విస్తరింపులను, అదనపు GConf కీలను, మెటాసిటీ ప్రవర్తనను నియంత్రించుటకు మరియు బగ్ పరిష్కారముల కొరకు అందించటమైంది.
8. కొత్త ప్యాకేజీలు
FreeRADIUS
FreeRADIUS అనునది అధిక-పనితనపు, అధికంగా ఆకృతీకరించగల, వుచిత రిమోట్ ఆథెంటికేషన్ డైయిల్ యిన్ యూజర్ సర్వీస్ (RADIUS) సర్వర్. నెట్వర్కు కొరకు కేంద్రీకృతమైన ధృవీకరణను మరియు అధికారమును అనుమతించుటకు యిది రూపొందించబడింది.
FreeRADIUS 2.0 అనునది కొత్త ప్యాకేజీవలె (freeradius2) Red Hat Enterprise Linux 5.5 నందు అందుబాటులో వుంది. FreeRADIUS 1 అనునది యిప్పటి Red Hat Enterprise Linux 5 నందు వాస్తవ freeradius ప్యాకేజీనందు అందుబాటులో వుంది. FreeRADIUS యొక్క వర్షన్ 2.0 అనునది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ unlang, వర్చ్యువల్ సర్వర్ మద్దతు., మెరుగుపరచిన RFC కవరేజ్ కొరకు అదనపు డైరెక్టరీలు మరియు యాట్రిబ్యూట్స్ & నెట్వర్కు పాకెట్స్ రెంటి కొరకు పూర్తి IPv6 మద్దతును యిచ్చుట వంటి చాలా కొత్త విశేషణములను కలిగివుంది.
Important
freeradius మరియు freeradius2 ప్యాకేజీలు వుమ్మడి ఫైళ్ళను పంచుకొనును, మరియు వొకే సిస్టమ్ పైన కలిపి సంస్థాపించబడలేవు.
PostgreSQL 8.4
PostgreSQL 8.4 (postgresql84) అనునది యిప్పుడు Red Hat Enterprise Linux 5 నందు పూర్తి మద్దతిచ్చు ఐచ్చికమువలె చేర్చబడింది. PostgreSQL 8.4 నందలి కొత్త విశేషణములు: పార్లల్ డాటాబేస్ రీస్టోర్, పర్-కాలమ్ అనుమతులు మరియు కొత్త పర్యవేక్షణా సాధనములు.
Important
PostgreSQL 8.1 (postgres ప్యాకేజీ ద్వారా అందించబడిన) నుండి మైగ్రేషన్ కొరకు pg_dump వుపయోగించి డాటా డంప్ మరియు రీస్టోర్ అవసరము. ఈ అవసరము కారణంగా, postgres మరియు postgresql84 ప్యాకేజీ స్థాయి విభేదాలను కలిగివున్నాయి మరియు వొక సిస్టమ్‌పై వొక వర్షన్ మాత్రమే సంస్థాపించగలము.
Samba
Samba అనునది ఫైళ్ళను, ముద్రికలను, మరియు యితర సమాచారమును పంచుకొనుటకు మిషన్ల ద్వారా వుపయోగించబడు ప్రోగ్రామ్సు యొక్క సూటు.
Samba3x ప్యాకేజీ సమితి వాస్తవంగా 5.4 విడుదల కొరకు x86_64 సప్లిమెంటరీనందు పరిచయం చేయబడెను. Red Hat Enterprise Linux 5.5 నందు, Samba3x నవీకరించబడెను మరియు యిప్పుడు అన్ని ఆకృతులపైన మద్దతించబడును. Samba3x అనునది Microsoft® Windows™ 7 యింటరాపరబిలిటి కొరకు మద్దతును కలిగివుంది.
Important
క్లస్టర్డ్ Samba మద్దతు అనునది యింకా సాంకేతిక పరిదృశ్యమే మరియు x86_64 ఆకృతినందు మాత్రమే అందుబాటులో వుండును.
Samba3x అనునది అప్‌స్ట్రీమ్ Samba 3.3 విడుదలపై ఆధారపడి వుండును మరియు ఆకృతీకరణ ఫైలు ఐచ్చికములనందు కింది మార్పులను చేర్చును:
పారామితి
వివరణ
అప్రమేయ
cups అనుసంధానం కాలముగింపు
కొత్త
30
idmap config DOM:range
తీసివేసిన
idmap డొమైన్లు
తీసివేసిన
init లాగాన్ డిలేడ్ హోస్ట్స్
కొత్త
""
init లాగాన్ గడువు
కొత్త
100
ldap ssl
మారిన అప్రమేయం
tls ప్రారంభం
భాగస్వామ్య రీతులు
తొలగించబడింది
winbind పునఃఅనుసంధానపు గడువు
కొత్త
30
libsmbclient ప్యాకేజీను వుద్భవింపచేయుటకు samba సోర్సు మూలకం రీపాక్టర్డ్ చేయబడింది. యెన్విరాన్మెంట్ నందలి యితర మూలకములకు క్లైంట్ యింటర్ఫేస్లను అందించుటకు samba మరియు samba3x రెండు ప్యాకేజీల నందు libsmbclient చేర్చబడింది.
Important
మద్దతీయబడే samba3x వర్షన్‌ను సంస్థాపించుటకు ముందుగా samba3x సాంకేతిక పరిదృశ్య ప్యాకేజీలను అన్నిటినీ తప్పక తీసివేయుము.
gPXE
Red Hat Enterprise Linux 5.5 కొత్త gPXE ప్యాకేజీను పరిచయం చేస్తోంది, వొక వోపెన్ సోర్స్ ప్రిబూట్ యెగ్జిక్యూషన్ యెన్విరాన్మెంట్ (PXE) అభివృద్ది. gPXE అనునది నెట్వర్కు అనుసంధానము ద్వారా సంస్థాపనా ప్రతిబింబములను బూట్ చేయగలిగే సామర్ధ్యాన్ని అందిస్తుంది.